సిటీబ్యూరో: గ్రేటర్లో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు అంబర్‌పేటలో 2.0 సెం.మీలు, బతుకమ్మకుంటలో 1.90 సెం.మీలు, మలక్‌పేటలో 1.75సెం.మీలు, వనస్థలిపురంలో 1.73సెం.మీలు, బోరబండలో 1.70 సెం.మీలు, సరూర్‌నగర్ అల్కాపురి కాలనీలో 1.65 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. రుతుపవన ద్రోణి కొనసాగుతుండడంతో రాగల 36 గంటల్లో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.