6.31 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అలజడికి కారణంమైంది. ఫలితంగా చమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడంతో దేశీయ సూచీలు ఒక్క శాతానికి పైగా పతనం చెందాయి.
ముంబై, జూన్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అలజడికి కారణంమైంది. ఫలితంగా చమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడంతో దేశీయ సూచీలు ఒక్క శాతానికి పైగా పతనం చెందాయి. వీటికితోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, రూపాయి పతనం చెందడం కూడా పతనానికి ఆజ్యంపోశాయి.
ఇంట్రాడేలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 719.08 పాయింట్లు నష్టపోయి 73,524.26 వద్దకు జారుకున్నది. మరో సూచీ నిఫ్టీ సైతం 243.70 పాయింట్లు కోల్పోయి 23,123 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.6,31,440.41 కోట్లు కరిగిపోయి రూ.4,55,28,758.96 కోట్లు (4.76 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది.
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సెంటిమెంట్‌కు తోడు క్రూడాయిల్ ధర త్వరలో 100 డాలర్లు దాటే అవకాశం ఉంద న్న అంచనాలు వెల్లడికావడం, గ్లోబల్ టెక్నాలజీ సంస్థల షేర్లు బలహీనంగా ఉండటం మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
- ఎటర్నల్ షేరు 3.24 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు ఇండిగో, మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ షేర్లు రెండు శాతానికి పైగా నష్టపోయాయి.
- వీటితోపాటు టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అదానీపోర్ట్స్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్, కొటక్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
- కానీ, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- రంగాలవారీగా రియల్టీ అత్యధికంగా 2.57 శాతం నష్టపోగా, మెటల్ 2.43 శాతం, ఇండస్ట్రియల్స్ 2.06 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.98 శాతం, ఆటో 1.85 శాతం చొప్పున పతనం చెందాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

