హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి
జిల్లాలో హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఆమె హరితహారం, మన ఊరు-మన బడిపై సమీక్షించారు. ప్రస్తుతం మొకలు నాటేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు.
- హరితహారం, మన ఊరు, మన బడిపై కలెక్టరేట్లో సమీక్ష
- మొక్కలు నాటి సంరక్షించాలి
- అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి
- వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య
ఖిలావరంగల్, జూలై 13: జిల్లాలో హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఆమె హరితహారం, మన ఊరు-మన బడిపై సమీక్షించారు. ప్రస్తుతం మొకలు నాటేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో మొక్కలు నాటి సంరక్షించే చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, స్వచ్ఛ భారత్-మిషన్ 2023 సంవత్సరానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలన్నారు. కమ్యూనిటీ సొక్పిట్స్, వాల్ పెయింటింగ్ పనులు ఈ నెల 15లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే, డీఆర్డీవో సంపత్రావు, డీపీవో కల్పన, డీఈవో వాసంతి పాల్గొన్నారు.
పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందించాలి
జిల్లాలో ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండల, గ్రామస్థాయిలో సమన్వయ కమిటీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే తగిన చికిత్స అందించడానికి సంబంధిత సిబ్బంది పేర్లతోపాటు వారికి సంబంధించిన సెల్ నంబర్లను ఆయా అడ్మినిస్ట్రేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రైవేటు సూళ్లు, కళాశాలల్లో 91,380 మంది పిల్లలను గుర్తించామన్నారు. వీరందరికీ జాతీయ నులిపురుగుల దినోత్సవం రోజు అల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు. సమీక్షలో డీఎంహెచ్వో కే వెంకటరమణ, జిల్లా ఇమినైజేషన్ అధికారి డాక్టర్ చెల్లా మధుసూదన్, నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ గోపాల్రావు, డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు.
పథకాలను వినియోగించుకోవాలి
ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను వియోగించుకోవాని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్లో ఇద్దరు ట్రాన్స్జెండర్లకు రూ. 50 వేల చొప్పున, ఒక దివ్యాంగుడికి రూ. 1,40,000 చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో డీబ్ల్యూవో శారద, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రాష్ట్ర సలహాదారుడు ఈవీ శ్రీనినవాసరావు, ట్రాన్స్జెండర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు ఓ లైలా, సీనియర్ అసిస్టెంట్ అరుణ, జూనియర్ అసిస్టెంట్ హేమలత, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ అనిరుధ్యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

