నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ వేరు.. రేవంత్‌రెడ్డి వేరు.. అన్నట్టు సాగుతున్న హస్తం పార్టీ రాజకీయాలు పరాకాష్టకు చేరినట్టు కనిపిస్తున్నది? అధిష్ఠానం ఇప్పటికే దూరం పెట్టిందని జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. వాస్తవంగా తన క్యాబినెట్‌లోని ఓ మంత్రిని బర్తరఫ్ చేయాలని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా అధిష్ఠానానికి సమాచారం ఇచ్చి పూర్తిచేయొచ్చు. కానీ అలాంటి అధికారాలేవీ ప్రస్తుత ముఖ్యమంత్రికి లేవని తాజా ఘటనలు చెప్తున్నాయి. తన క్యాబినెట్‌లోని మంత్రి కుమార్తె నేరుగా ముఖ్యమంత్రినే తీవ్రస్థాయిలో విమర్శించినా, నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేకనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రెస్‌మీట్ పెట్టించినట్టు సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో జరుగుతున్న అనేక పరిణామాలతో సతమతం అవుతున్న రేవంత్‌కు.. తాజా వ్యవహారం అస్సలు మింగుడుపడటం లేదని తెలుస్తున్నది.
ఇటీవల ప్రధాని మోదీ, సీఎం రేవంత్ వ్యవహారం ‘చోటా భాయ్.. బడే భాయ్’ అన్నట్టు సాగుతున్నది. అంతేగాక ఒక సభలో రేవంత్‌ను ఉద్దేశించి ‘మేరే సే జోడో’ అంటూ స్వయంగా మోదీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం, అందుకు సీఎం నవ్వుతూ ‘బడే భాయ్’ అంటూ సానుకూలంగా స్పందించారనే కోణంలో పార్టీ పెద్దల్లో చర్చ జరిగింది. ఇక కేరళలో కాంగ్రెస్ సీఎం ఎంపిక వ్యవహారంలో కూడా అధిష్ఠానం సతీశన్ వైపు మొగ్గుచూపితే.. రేవంత్ మాత్రం దానికి వ్యతిరేకంగా కేసీ వేణుగోపాల్‌కు మద్దతు తెలిపారు. దీంతో రేవంత్‌కు అధిష్ఠానానికి దూరం మరింత పెరిగిందని తెలుస్తున్నది. అదీగాక పలు సందర్భాల్లో ఎన్డీయే కూటమిలో కీలకమైన చంద్రబాబుతో సన్నిహితంగా మెలగడం కూడా ఢిల్లీ పెద్దలకు మింగుడు పడటం లేదు. ఈ పరిణామాలతో హస్తం పెద్దలు రేవంత్‌ను పూర్తిగా దూరం పెట్టినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో కొండా వ్యవహారం రేవంత్‌కు అగ్నిపరీక్షలా మారింది. తన క్యాబినెట్‌లోని మంత్రిని బర్తరఫ్ చేసే అధికారం చేతిలో ఉన్నా.. అధిష్టానం మద్దతు లేకపోవడం రేవంత్‌ను ఇరకాటంలో పడేసింది. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కూడా అ వకాశం దొరికినప్పుడల్లా రేవంత్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పరకాల సభలో సీఎం వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఎవరికి వారు అభ్యర్థులను ప్రకటించడం కాంగ్రెస్ విధానానికి వ్యతిరేకమని.. అధిష్ఠానమే అభ్యర్థులను ఖరారు చేస్తుందని స్పష్టంచేశారు.
తన ఉనికి చాటుకొనేందుకే అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను రేవంత్ రం గంలోకి దింపారని సమాచారం. ప్రెస్మీట్లో కూడా రేవంత్ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. మళ్లీ ఆయన నే తృత్వంలోనే అధికారంలోకి వస్తామని చె ప్పించడం చూస్తుంటే పార్టీని పకన పెట్టి వ్యక్తికే ప్రాధాన్యత ఇచ్చేలా ఎమ్మెల్యేల తీ రు సాగిందని చెప్పుకొంటున్నారు. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలం టే పార్టీ పెద్దలను ఒప్పించలేక.. మరోవైపు తనపై జరిగిన విమర్శల దాడిని తట్టుకోలేక.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎగదోయడం.. అధిష్ఠానానికి అ ల్టిమేటం జారీ చేయడమేననే చర్చ మొదలైంది.