Revanth Reddy | అగాధమా? అల్టిమేటమా?.. సొంత పార్టీ వర్గాలనే కలవర పరుస్తున్న రేవంత్ తీరు
Revanth Reddy | కాంగ్రెస్ పార్టీ వేరు.. రేవంత్‌రెడ్డి వేరు.. అన్నట్టు సాగుతున్న హస్తం పార్టీ రాజకీయాలు పరాకాష్టకు చేరినట్టు కనిపిస్తున్నది? అధిష్ఠానం ఇప్పటికే దూరం పెట్టిందని జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతున్నది.
Revanth Reddy | నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ వేరు.. రేవంత్‌రెడ్డి వేరు.. అన్నట్టు సాగుతున్న హస్తం పార్టీ రాజకీయాలు పరాకాష్టకు చేరినట్టు కనిపిస్తున్నది? అధిష్ఠానం ఇప్పటికే దూరం పెట్టిందని జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. వాస్తవంగా తన క్యాబినెట్‌లోని ఓ మంత్రిని బర్తరఫ్ చేయాలని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా అధిష్ఠానానికి సమాచారం ఇచ్చి పూర్తిచేయొచ్చు. కానీ అలాంటి అధికారాలేవీ ప్రస్తుత ముఖ్యమంత్రికి లేవని తాజా ఘటనలు చెప్తున్నాయి. తన క్యాబినెట్‌లోని మంత్రి కుమార్తె నేరుగా ముఖ్యమంత్రినే తీవ్రస్థాయిలో విమర్శించినా, నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేకనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రెస్‌మీట్ పెట్టించినట్టు సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో జరుగుతున్న అనేక పరిణామాలతో సతమతం అవుతున్న రేవంత్‌కు.. తాజా వ్యవహారం అస్సలు మింగుడుపడటం లేదని తెలుస్తున్నది.
ఇరకాటంలో రేవంత్..
ఇటీవల ప్రధాని మోదీ, సీఎం రేవంత్ వ్యవహారం ‘చోటా భాయ్.. బడే భాయ్’ అన్నట్టు సాగుతున్నది. అంతేగాక ఒక సభలో రేవంత్‌ను ఉద్దేశించి ‘మేరే సే జోడో’ అంటూ స్వయంగా మోదీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం, అందుకు సీఎం నవ్వుతూ ‘బడే భాయ్’ అంటూ సానుకూలంగా స్పందించారనే కోణంలో పార్టీ పెద్దల్లో చర్చ జరిగింది. ఇక కేరళలో కాంగ్రెస్ సీఎం ఎంపిక వ్యవహారంలో కూడా అధిష్ఠానం సతీశన్ వైపు మొగ్గుచూపితే.. రేవంత్ మాత్రం దానికి వ్యతిరేకంగా కేసీ వేణుగోపాల్‌కు మద్దతు తెలిపారు. దీంతో రేవంత్‌కు అధిష్ఠానానికి దూరం మరింత పెరిగిందని తెలుస్తున్నది. అదీగాక పలు సందర్భాల్లో ఎన్డీయే కూటమిలో కీలకమైన చంద్రబాబుతో సన్నిహితంగా మెలగడం కూడా ఢిల్లీ పెద్దలకు మింగుడు పడటం లేదు. ఈ పరిణామాలతో హస్తం పెద్దలు రేవంత్‌ను పూర్తిగా దూరం పెట్టినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో కొండా వ్యవహారం రేవంత్‌కు అగ్నిపరీక్షలా మారింది. తన క్యాబినెట్‌లోని మంత్రిని బర్తరఫ్ చేసే అధికారం చేతిలో ఉన్నా.. అధిష్టానం మద్దతు లేకపోవడం రేవంత్‌ను ఇరకాటంలో పడేసింది. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కూడా అ వకాశం దొరికినప్పుడల్లా రేవంత్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పరకాల సభలో సీఎం వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఎవరికి వారు అభ్యర్థులను ప్రకటించడం కాంగ్రెస్ విధానానికి వ్యతిరేకమని.. అధిష్ఠానమే అభ్యర్థులను ఖరారు చేస్తుందని స్పష్టంచేశారు.
అటు అధిష్ఠానంతో దూరం.. ఇటు టీపీసీసీతోనూ పొసగని వైనం..
తన ఉనికి చాటుకొనేందుకే అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను రేవంత్ రం గంలోకి దింపారని సమాచారం. ప్రెస్మీట్లో కూడా రేవంత్ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. మళ్లీ ఆయన నే తృత్వంలోనే అధికారంలోకి వస్తామని చె ప్పించడం చూస్తుంటే పార్టీని పకన పెట్టి వ్యక్తికే ప్రాధాన్యత ఇచ్చేలా ఎమ్మెల్యేల తీ రు సాగిందని చెప్పుకొంటున్నారు. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలం టే పార్టీ పెద్దలను ఒప్పించలేక.. మరోవైపు తనపై జరిగిన విమర్శల దాడిని తట్టుకోలేక.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎగదోయడం.. అధిష్ఠానానికి అ ల్టిమేటం జారీ చేయడమేననే చర్చ మొదలైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

