Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Scene | దీపావళి పండుగ సందర్భంగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఒకవైపు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, మరోవైపు సూర్య నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సీన్’ కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
Scene | దీపావళి పండుగ సందర్భంగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఒకవైపు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, మరోవైపు సూర్య నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సీన్’ కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. భారీ సినిమాతో పోటీ ఉన్నప్పటికీ ఈ చిత్రం టికెట్ బుకింగ్స్‌లో మంచి జోరు చూపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో వరుసగా రెండు రోజులు భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సూర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు జితు మాధవన్ దర్శకత్వం వహించారు. మలయాళంలో ‘ఆవేశం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జితు మాధవన్, ఈ చిత్రంతో తమిళ పరిశ్రమలో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.
ఇందులో నజ్రియా ఫహాద్, నస్లెన్ కీలక పాత్రలు పోషించారు. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా.‘సీన్’ సినిమా బాక్సాఫీస్ ప్రయాణంలో బుక్ మై షో టికెట్ బుకింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా 5.78 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. రెండో రోజు కూడా దాదాపు 5.74 లక్షల టికెట్లు విక్రయమైనట్లు బుకింగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు టికెట్ అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల మాత్రమే కనిపించింది. అయినప్పటికీ వరుసగా రెండు రోజులు దాదాపు ఒకే స్థాయిలో బుకింగ్స్ నమోదవడం విశేషం. ఈ లెక్కల ప్రకారం రెండు రోజుల్లోనే 11.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
సాధారణంగా భారీ సినిమాలు విడుదలైనప్పుడు ఇతర చిత్రాల బుకింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కానీ ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ వంటి భారీ విజువల్ స్పెక్టకిల్ పోటీలో ఉన్నప్పటికీ ‘సీన్’ సినిమాకు ఈ స్థాయిలో స్పందన రావడం విశేషంగా మారింది. ‘సీన్’ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికే హిట్‌గా నిలిచిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మొదటి శనివారం సాధించిన బుక్ మై షో టికెట్ అమ్మకాల రికార్డును ఇది అధిగమించినట్లు సమాచారం. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొదటి శనివారం సుమారు 5.06 లక్షల టికెట్లు విక్రయించగా, ‘సీన్’ రెండో రోజు ఏకంగా 5.74 లక్షల టికెట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీంతో ఈ సినిమా బుకింగ్స్ పరంగా మరో ముందడుగు వేసినట్లయింది. ఈ గణాంకాలు సూర్య సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని తెలియజేస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

