హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమ స్తే తెలంగాణ): కేరళ ఎన్నికల ప్ర చారంలో సీఎం రేవంత్‌రెడ్డి అక్క డి లెఫ్ట్ కూటమి పై నోరు పారేసుకున్నారు. లెఫ్ట్ కూ టమికి ఓటేస్తే ప్రధాని మోదీకి వేసినట్టేనని ఆరోపించారు. రేవంత్ వ్యా ఖ్యలు ఇండియా కూటమిలో చిచ్చుపెట్టేలా ఉన్నాయ ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాగంగా సీఎం రేవంత్ బుధవారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తరఫున రోడ్‌షోలో మాట్లాడారు.
ప్రధానికి విజయన్ నీడ లాంటివాడని, వాళ్లిద్దరూ అన్నదమ్ముల లాంటివారని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనపై కేరళ సీఎం విజయన్ ఇటీవల విమర్శలు గుప్పించారు. ఈ కారణంగానే విజయన్‌పై రేవంత్ కక్షతో ఈ వ్యా ఖ్యలు చేశారని ఎల్డీఎఫ్ కూటమి మండిపడుతున్నది. కేరళలో సీఎం రేవంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణలోని సీపీఐ, సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రాజకీయ అవకాశవాదానికి ఈ వైఖరి పరాకాష్ట అని ఆయా పా ర్టీల నాయకులు విమర్శిస్తున్నారు.