తరుణ్‌భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ సినిమా నుంచి ‘బ్రైడ్ సాంగ్’ను విడుదల చేశారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ మూడ్‌ని ప్రతిబింబిస్తూ ఈ పాట సాగింది. ‘కాటుక దిద్దిన కళ్లు.. సిగ్గులు అద్దిన చెక్కిళ్లు’ అంటూ పెళ్లికి ముందు వధువు మనోభావాల్ని అందంగా ప్రజెంట్ చేసింది. సంగీత దర్శకుడు స్వీకర్ ఆగస్తీ ట్రెండీ బీట్తో పాటను కంపోజ్ చేశారు. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. అమెరికా వెళ్లాలని కలలు కనే యువకుడు ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంలో హాస్యప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్ అగస్తీ, నిర్మాతలు: కల్యాణ చక్రవర్తి, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్, రచన-దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్.