రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి
రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డి మాండ్ చేశారు. బుధవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తీసుకోవాల్సిన అప్పు కన్నా రూ.15,139 కోట్ల అప్పు ఎక్కువగా చేసిందని వెల్లడించారు.
- తీసుకోవాల్సిన దాని కన్నా రూ.15,139 కోట్ల ఎక్కువ అప్పు
- బడ్జెట్లో నిరుద్యోగ భృతి,కొత్త ఉద్యోగాల ఊసే లేదు
- ప్రభుత్వంపై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డి మాండ్ చేశారు. బుధవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తీసుకోవాల్సిన అప్పు కన్నా రూ.15,139 కోట్ల అప్పు ఎక్కువగా చేసిందని వెల్లడించారు. పేదల భూ ము లు లాక్కోవడానికే సీఎం రేవంత్‌రెడ్డి రేడియ ల్ రోడ్ల పేరిట భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ లేని చోట ఫ్యూచర్ సిటీ కడతామని చెబుతున్నారని చురకలటించారు. నాడు జీతాలు పెంచాలని ఆశావర్కర్లు దీక్ష చేస్తే వాళ్ల దగ్గరికి సీతక్క వెళ్లి తాను మాజీ నక్సలైట్ అని, మీ కష్టాలన్నీ తెలుసని నమ్మిం చారని గుర్తుచేశారు.
మీ సమస్యలు పరిష్కరించేందుకే రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.18వేలు పెంచుతామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. దాదాపు 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు లేవని ఆందోళన వ్యక్తంచేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక 86మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు బయటకు రాకుండా ఆంధ్ర వ్యక్తి శ్రీరామ్‌ను మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా నియమించి మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వంలో అడ్వైజర్లుగా 8మంది ఆంధ్రవాళ్లను నియమించడం ఏమి టని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ జరిగే పరిస్థితి లేదని, కేవలం సెటిల్మెంట్ చేసుకోవడానికే మధు పార్క్ రిట్జ్ సహా పది వేల మందికి నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. పేద ప్రజల ఇండ్ల కూల్చివేతలు బూచిగా చూపి పెద్దల వద్ద భారీగా సెటిల్మెం ట్లు చేసుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇళ్లు చెరువులో ఉంటే దాని జోలికి హైడ్రా వెళ్లడం లేదని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూలగొట్టడం లేదని ఆయన ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

