అగ్రి వర్సిటీలో అదనంగా మరో 360 బీఎస్సీ సీట్లు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అందిస్తున్న బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, ఇతర కోర్సుల్లో అదనంగా 360 సీట్లు పెంచినట్టు వర్సిటీ ప్రకటించింది.
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అందిస్తున్న బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, ఇతర కోర్సుల్లో అదనంగా 360 సీట్లు పెంచినట్టు వర్సిటీ ప్రకటించింది. కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడువును ఆగస్టు 13 వరకు పొడిగించినట్టు ఉప కులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.
ఎప్‌సెట్-2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది కొత్తగా ప్రారంభించిన కొడంగల్, హుజూర్నగర్, డిచ్పల్లి కళాశాలల్లో ఈ ఏడాది నుంచి ఒకో కళాశాలలో అదనంగా 120 సీట్లు భర్తీ చేయనున్నట్టు వివరించారు. వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

