హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మాడల్ స్కూల్స్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయాలని.. 010 పద్దు ద్వారా వేతనాలు అందించాలని ప్రోగెస్సివ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు తరాల జగదీశ్ డిమాండ్ చేశారు.
మాడల్ స్కూళ్లలో అనేక సమస్యలున్నాయని ఓ ప్రకటనలో తెలిపారు. 1,150 టీచర్ పోస్టులను భర్తీచేయాలని, ఇంటర్ విద్యాబోధనకు ప్రత్యేకంగా జేఎల్ కేడర్‌ను ఏర్పాటు చేయాలని, 13 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగోన్నతులు పూర్తిచేయాలని కోరారు.