వందో సినిమాలో పాతికేళ్ల యువకుడిగా?
అగ్ర నటుడు నాగార్జున తన ప్రతిష్టాత్మక వందవ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. రా.కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి నాగార్జున కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.
అగ్ర నటుడు నాగార్జున తన ప్రతిష్టాత్మక వందవ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. రా.కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి నాగార్జున కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఇంకా ఈ సినిమా పేరును ఖరారు చేయలేదని, షూటింగ్ మాత్రం 45శాతం పూర్తయిందని నాగార్జున తెలిపారు. సున్నా నుంచి కోటీశ్వరుడిగా ఎదిగిన ఓ వ్యక్తి ప్రయాణాన్ని ఇందులో చూస్తారని, తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని, ఇది పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ అనీ నాగార్జున చెప్పారు. ఇదిలావుంటే.. ఈ సినిమాలో నాగార్జున పాతికేళ్ల నుంచి 60ఏండ్ల వరకూ రకరకాల వయసుల్లో కనిపిస్తారట. ముఖ్యంగా పాతికేళ్ల యువకుడిగా కనిపించేందుకు ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీని వాడుతున్నట్టు తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రధారులు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

