అమరావతి : హిందూ మహిళలకు పవిత్రమైన పూజల్లో ఒకటైన కార్తిక పౌర్ణమి( Karthika Pournami ) రోజున పోలీసులు ఆంక్షలు ( Restrictions ) విధించడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. ప్రతియేట వేలాదిమంది ప్రజలు కార్తికపౌర్ణమి రోజున ఏపీలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానాల కోసం భక్తులు తరలివస్తారు. ఈసారి మాత్రం పోలీసులు ఆంక్షలతో వారిని అడ్డుకున్నారు.
ఇటీవల మొంథా తుపాన్ కారణంగా సముద్ర తీరాల ప్రాంతాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వాటిలో తీర ప్రాంత గ్రామాలు, లంకల్లోకి నీరు చొచ్చుకురావడం, సముద్రపు ఒడ్డున ప్రమాదకర గోతులు ఏర్పడడంతో అధికారులు ముందస్తుగా బీచ్‌ను మూసి వేశారు. బుధవారం ఉదయం బీచ్‌కు వచ్చేందుకు యత్నించిన భక్తులను పోలీసులు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపించి వేశారు. స
ముద్రపు ఒడ్డున గోతులు ఏర్పడడంతో ప్రమాదాలకు ముప్పు ఉంటుందని భక్తులకు పోలీసులు వివరించారు. బాపట్ల జిల్లాలోని రామాపురం, ఓడరేవు, సూర్యలంక, పాండురంగాపురం బీచ్లలోకి భక్తులు, యాత్రికులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.