Priyanka Gandhi : బీహార్ (Bihar) లో ఓట్ల చోరీకి పాల్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే కూటమి (NDA alliance) కుటిలయత్నం చేస్తున్నదని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో బీహార్లో మహిళలు సహా 65 లక్షల మంది ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని విమర్శించారు.
బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, అందుకే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు పూర్తిగా ఓట్ల చోరీలో మునిగిపోయిందని ప్రియాంక ఆరోపించారు. బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వెస్ట్ చంపారన్ జిల్లాలో ఆమె ఇవాళ ప్రచారం నిర్వహించారు. వాల్మీకి నగర్, చన్పాటియాల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ప్రసంగించారు.
దేశంలో ప్రస్తుత ఎన్డీయే పాలన బ్రిటిష్ పాలనను తలపిస్తోందని ప్రియాంకాగాంధీ విమర్శించారు. ఎన్డీయే తీరు చూస్తుంటే భవిష్యత్తులో దేశంలో అసలు ఎన్నికలు జరుగుతాయో, జరుగవోనని అనుమానంగా ఉందని ఆమె చెప్పారు.