సారంగాపూర్, జూలై 22: తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను చెల్లించాలని కంప్యూటర్ ఆపరేటర్లు మంగళవారం ఎంపీడీఓ చౌడారపు గంగాధర్‌కు వినతి పత్రం అందజేశారు. మండల పరిషత్ కార్యలయంలో కంప్యూటర్ ఆపరేటర్లుగా ముగ్గురం పని చేస్తున్నామని గత నాలుగు నెలలుగా తమకు వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు.
కుటుంబ పోషణ, నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని తమ ఇబ్బందులను గుర్తించి పెండింగ్‌లో ఉన్న వేతనాలు మంజూరి చేసి తమను ఆదుకోవాలని ఎంపీడీఓను కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కృష్ణారెడ్డి. ఈ పంచాయతీ ఆపరేటర్లు మానస, స్వప్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.