జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ( PRC ) , డీఏ ( DAs) లు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య ( Bonagiri Devayya ) డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) జగిత్యాల్ అర్బన్, రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలైన పీఆర్సీవెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల మంజూరు, ఈ-కుబేర్ పెండింగ్ బిల్లుల చెల్లింపు, పాత పెన్షన్ (OPS) అమలు వంటి కీలక అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించకపోతే ఉపాధ్యాయ, ఉద్యోగుల ఉద్యమ కార్యచరణను ఉదృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అనే విషయం ఏనాడు ఏ ఉద్యోగి కోరలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ప్రసాదరావు, కొక్కుల రాజేష్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్ట రామకృష్ణ,రాజేశ్వర్,రమేష్ , జిల్లా బాధ్యులు సాయిని శ్రీనివాస్, బాలాజీ సింగ్ , జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.