కరకగూడెం, జూలై 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ల గ్రామానికి చెందిన చందా లింగయ్యకు అరుదైన గౌరవం లభించింది. చందా లింగయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ గా సేవలందించినందుకు గాను అలాగే ఆదివాసీ జాతి హక్కుల సాధనకు కృషి, సుదీర్ఘకాలం పాటు ఆదివాసీ ప్రాంతానికి సేవలందించినందుకు గానూ తమిళనాడు రాష్ట్రంలోని పుదుచ్చేరిలో యునైటైడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్స్‌లెన్స్ అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. మారుమూల గిరిజన ప్రాంతం నుండి గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన చందా లింగయ్యకు ఈ అవార్డు రావడం పట్ల మండలంలోని ఆదివాసీ సంఘాల నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్యకు గౌరవ డాక్టరేట్