Renu Desai | ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. అనంతరం ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి కొన్నాళ్ళపాటు పవన్‌తో వైవాహిక జీవితం కొనసాగించింది. అయితే కొన్ని కారణాల వలన వారిద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ నుండి విడిపోయిన తర్వాత పూణెలో స్థిరపడిన రేణూ, అప్పుడప్పుడు సోషల్ మీడియా లేదా వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణూ, ఆ తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. ఆ సినిమా చేసినప్పుడు నాపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ యాక్టింగ్ అంటే నాకు ఇష్టం , అదే నా టార్గెట్ కాదు’’ అని ఆమె ఇటీవల స్పష్టంచేశారు.
తనను ఎవరైనా విమర్శించినా పెద్దగా పట్టించుకోనని, తాను యాక్టింగ్‌ను కేవలం ప్యాషన్‌తో మాత్రమే చేస్తానని చెప్పిన రేణూ, “నాకు యాక్టింగ్ మీద మక్కువ ఉన్నా అది నా జీవన లక్ష్యం కాదు. హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి సినిమాలు చేస్తూ వచ్చి ఉంటే నాకు మంచి పేరు వచ్చేది” అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణూ తన పిల్లలతోనే ఉంటూ, కరోనా కాలంలో ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ విమర్శలకు తట్టుకోలేక ఆ ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయినప్పటికీ రెండో పెళ్లి గురించి తాను ఓపెన్‌గా మాట్లాడుతూ వచ్చిన రేణూ, ఇప్పుడు మాత్రం మరో షాకింగ్ కామెంట్ చేశారు.
“ఇంకో ఏడాది మాత్రమే ఇలా ఉంటాను… ఆ తర్వాత సన్యాసం తీసుకుని ఆశ్రమానికి వెళ్లే అవకాశం ఉంది” అని ఆమె హింట్ ఇచ్చారు. ఈ కామెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే సన్యాసం తీసుకోవాలనే నిర్ణయం వెనుక ఉన్న కారణం మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇక కెరీర్ విషయానికొస్తే, ప్రస్తుతం మహిళా ప్రాధాన్యమున్న కొన్ని మంచి ఆఫర్లు వస్తున్నాయని, ఇటీవల అత్తా-కోడళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఓ కామెడీ డ్రామా చిత్రానికి సైన్ చేసినట్లు రేణూ తెలిపారు. అయితే కొన్నాళ్లుగా రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ వచ్చిన రేణూ దేశాయ్ ఇప్పుడు సడెన్‌గా సన్యాసం గురించి చెప్పడం సినీ వర్గాలనూ, అభిమానులనూ ఆశ్చర్యపరుస్తోంది.