Sujeeth Sign | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్‌లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుజీత్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్‌ని పంచుకున్నాడు.
ఓజీ’ ప్రాజెక్ట్‌ను నమ్మి పూర్తి సపోర్ట్ ఇచ్చిన నా నిర్మాత డీవీవీ దానయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలామంది సినిమా గురించి వివిధ మాటలు చెప్పారు. కానీ ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకూ ఏం అవసరమో అర్థం చేసుకుని టీమ్‌తో కలిసి నడిచిన దానయ్య గారి మద్దతు మాటల్లో చెప్పలేనిది. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఈ విజయం మన అందరిది అంటూ రాసుకోచ్చాడు.. ఇటీవల ‘ఓజీ’ బడ్జెట్, పోస్ట్-ప్రొడక్షన్ ఖర్చులపై నిర్మాత దానయ్య, దర్శకుడు సుజీత్ మధ్య విభేదాలు ఉన్నాయనే రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రూమర్స్‌పై సుజిత్ పోస్ట్‌తో క్లారిటీనిచ్చినట్లు తెలుస్తుంది.
OG director has put the full stop to all the fake speculations running around since yesterday. #Sujeeth #DVV #TheyCallHimOG #PawanKalyan pic.twitter.com/S3Qx58jcJK
— The Cine Gossips (@TheCineGossips) October 21, 2025