Parasakthi | ఇటీవల మదరాసి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు శివ కార్తికేయన్ తన తదుపరి ప్రాజెక్ట్ పరాశక్తిని విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా శ్రీలీల హీరోయన్‌గా నటిస్తుంది. రవి మోహన్, అథర్వ, రానా దగ్గుబాటి, బేసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ షూట్ ర్యాప్ అంటూ ఒక వీడియోను వదిలింది. ఈ చిత్రం పోంగల్ కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.