తిరుపతి, జూన్ 14:కొన్ని రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో ఎర్రచందనం స్మగ్లర్ల కాస్త తగ్గినా ,మళ్లీ ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలోని రైల్వే కోడూరు పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు, ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎర్రచందనం స్మగ్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం సుమారు 725 కిలోల 27 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు దొంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు.
కాగా, రెండు రోజుల కిందట కడప జిల్లాలో ఎర్రచంనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒంటిమిట్టకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లరు కొత్త మాధవరం గ్రామానికి చెందిన టక్కోలి రవికుమార్ రెడ్డి, చొప్ప మురళి, నర్వకాటి పల్లికి చెందిన దులాదుల శ్రీనివాసులు ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పర్చుకుని గత కొన్నేళ్లుగా ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టక్కోలి రవికుమార్ రెడ్డిపై ఇప్పటివరకు 9 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.