జొన్నలు: ఒక కప్పు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, కరివేపాకు: రెండు రెబ్బలు, ఆవపిండి: ఒక టీస్పూన్, ఎండు మిరపకాయలు: నాలుగు, పచ్చిమిర్చి: మూడు, పల్లీలు: పావు కప్పు, శెనగ పప్పు, మినుప పప్పు: ఒక టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, పసుపు: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, చింతపండు: నిమ్మకాయంత,
ఇంగువ: చిటికెడు.
జొన్న పులిహోర తయారీ విధానం
జొన్నలను నాలుగు గంటలపాటు నానబెట్టి పొడిపొడిగా ఉడికించి నీళ్లు వంపి పక్కన పెట్టుకోవాలి. చింతపండును నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, మినుప పప్పు, శెనగ పప్పు, పల్లీలు, కరివేపాకు, ఇంగువ వేయాలి. బాగా వేగాక ఆవపిండి, పసుపు జోడించాలి. అన్నీ బాగా వేగాక చింతపండు రసం, ఉప్పు, కారం వేసి దగ్గర పడేవరకు సన్నటి మంటపై ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక.. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న జొన్నలను వేసి బాగా కలిపి దించితే జొన్న పులిహోర సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
broccoli kofta recipe | వెరైటీ టేస్ట్ కావాలా? బ్రకోలితో ఇలా ట్రై చేయండి
ఆకాశన్నంటిన టమాటా ధరలు.. టమాట బదులు కూరల్లో వీటిని ట్రై చేయండి
recipe of chicken pancake | రుచికరమైన చికెన్ పాన్కేక్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి
broccoli mushroom fry recipe | బ్రకోలి మష్రూమ్ ఫ్రై
chicken paratha recipe | చికెన్ పరాఠా రెసిపీ