‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. దేశంలోని 40 శాతం మంది టీనేజర్లు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారట. ఇక ఉద్యోగులు, గృహిణులు, పెద్దవాళ్లలో స్ట్రెస్ బాధితులు అంతకు ఎక్కువే ఉన్నారట. వీరిలో అధికశాతం మంది.. ఈ ఒత్తిడి నుంచి బయట పడటానికి లేనిపోని మందులు వాడుతున్నారట. కొందరు మాత్రమే.. ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ, ఒత్తిడిని చిత్తు చేస్తున్నారు. మానసిక స్థితిని, మెదడులోని రసాయనాలను ప్రభావితం చేసే ‘మూడ్ బూస్టింగ్ ఫుడ్స్’ను తీసుకుంటున్నారు. శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్లు పెరగడానికి సహాయపడే ఆ అద్భుతమైన ఆహార పదార్థాలేంటో.. మనమూ తెలుసుకుందామా!