హైదరాబాద్, ఫిబ్రవరి 10: అపోలో హాస్పిటల్స్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 35 శాతం ఎగబాకి రూ.502 కోట్లకు చేరుకున్నది. మూడు బిజినెస్ వర్టికల్స్ అంచనాలకు మించి రాణించడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. కంపెనీ ఆదాయం రూ.6,477 కోట్లకు ఎగబాకింది.