Home
Lifestyle
Recent Study Conducted By The Indian Psychiatric Society 40 Percent Of Teenagers In The Country Suffer From Stress And Anxiety
మెదడుకు మేత!
‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. దేశంలోని 40 శాతం మంది టీనేజర్లు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారట. ఇక ఉద్యోగులు, గృహిణులు, పెద్దవాళ్లలో స్ట్రెస్ బాధితులు అంతకు ఎక్కువే ఉన్నారట.
‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. దేశంలోని 40 శాతం మంది టీనేజర్లు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారట. ఇక ఉద్యోగులు, గృహిణులు, పెద్దవాళ్లలో స్ట్రెస్ బాధితులు అంతకు ఎక్కువే ఉన్నారట. వీరిలో అధికశాతం మంది.. ఈ ఒత్తిడి నుంచి బయట పడటానికి లేనిపోని మందులు వాడుతున్నారట. కొందరు మాత్రమే.. ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ, ఒత్తిడిని చిత్తు చేస్తున్నారు. మానసిక స్థితిని, మెదడులోని రసాయనాలను ప్రభావితం చేసే ‘మూడ్ బూస్టింగ్ ఫుడ్స్’ను తీసుకుంటున్నారు. శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్లు పెరగడానికి సహాయపడే ఆ అద్భుతమైన ఆహార పదార్థాలేంటో.. మనమూ తెలుసుకుందామా!
- తక్షణమే మూడ్‌ను మార్చేయగల సత్తా.. డార్క్ చాక్లెట్‌కు ఉంటుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్.. మెదడుకు రక్త ప్రసరణను పెంచుతాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. అయితే, మంచి ఫలితం కనిపించాలంటే.. కనీసం 70శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోవడం బెటర్.
- టీ, కాఫీలో ఉండే కెఫిన్, ఎల్-థియనైన్ ఏకాగ్రతను పెంచుతాయి. ఉత్సాహంగా ఉంచుతాయి. అయితే, వీటిని మితంగా తీసుకోవడమే మంచిది.
- బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, గుమ్మడి గింజలు.. అద్భుతమైన మూడ్ బూస్టర్లుగా పనిచేస్తాయి. వీటిల్లో పుష్కలంగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక గింజల్లో ఉండే అమైనో యాసిడ్స్.. శరీరంలో సెరోటోనిన్ తయారీలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
- బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలతోపాటు ఉసిరికాయల్లోనూ యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడులోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతోపాటు డిప్రెషన్ లక్షణాలను అదుపులో ఉంచుతాయి.
- పెరుగు, కిమ్చీ, కొంబుచా లాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మెదడుకు-జీర్ణవ్యవస్థకు నేరుగా సంబంధం ఉంటుంది. మన శరీరంలోని సెరోటోనిన్లో దాదాపు 90 శాతం పేగుల్లోనే తయారవుతుంది. కాబట్టి, పేగుల ఆరోగ్యం కోసం పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకోవాలి.
- అరటిపండు కూడా మూడ్ బూస్టింగ్‌గా పనిచేస్తుంది. ఇందులో లభించే విటమిన్ బి6.. డోపమైన్, సెరోటోనిన్ విడుదలకు సాయపడుతుంది. అరటిపండులోని పీచు పదార్థం.. రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుతుంది. కోపం, చిరాకు రాకుండా చూస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

