కొలంబో: టీ20 ప్రపంచకప్‌నకు సహ ఆతిథ్యదేశంగా ఉన్న శ్రీలంకకు టోర్నీ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు గాయంతో ఇబ్బందిపడుతూనే బౌలింగ్ చేశాడు. కానీ మ్యాచ్ అనంతరం వైద్య పరీక్షల్లో అతడి గాయం తీవ్రత ఎక్కువుందని తేలడంతో హసరంగ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.