ఓపెనర్లే దంచేశారు.. కివీస్‌కు రికార్డు విజయం
పొట్టి ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న న్యూజిలాండ్.. తమ రెండో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది. పసికూన యూఏఈతో చెన్నైలో జరిగిన గ్రూప్ డీ మ్యాచ్‌లో ఆ జట్టు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఓపెనర్లే దంచేశారు.
చెన్నై: పొట్టి ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న న్యూజిలాండ్.. తమ రెండో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది. పసికూన యూఏఈతో చెన్నైలో జరిగిన గ్రూప్ డీ మ్యాచ్‌లో ఆ జట్టు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఓపెనర్లే దంచేశారు. విధ్వంసకర ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (42 బంతుల్లో 89 నాటౌట్, 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిన్ అలెన్ (50 బంతుల్లో 84 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధ శతకాలతో వీరబాదుడు బాది కివీస్‌కు 10 వికెట్ల భారీ విజయాన్ని అందించారు. ఈ ఇద్దరి విధ్వంసంతో పూర్తి ఏకపక్షంగా మారిన పోరులో లక్ష్యాన్ని కివీస్ 15.2 ఓవర్లలోనే పూర్తిచేసింది.
ఆరంభం నుంచే బౌండరీలు, సిక్స్‌లతో మోత మోగించిన ఈ జోడీ పవర్ ప్లేలోనే 78 రన్స్ రాబట్టింది. సీఫర్ట్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకోగా అలెన్‌కు 27 బంతులు అవసరమయ్యాయి. 9 ఓవర్లకే వంద పరుగుల మార్కును దాటిన ఆ ద్వయం.. ఆ తర్వాత అదే ఊపుతో లాంఛనాన్ని పూర్తిచేసింది. యూఏఈ తరఫున కెప్టెన్ మహ్మద్ వసీం (45 బంతుల్లో 66 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), అలిషాన్ షరాఫు (47 బంతుల్లో 55, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో ఆ జట్టు మెరుగైన స్కోరు చేయగల్గింది.
1 టీ20 ప్రపంచకప్లలోఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం(175)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

