అహ్మదాబాద్: విరాట్ కోహ్లీ నుంచి టీమ్ఇండియా క్యాప్ అందుకోవడంతో తన కల నెరవేరిందని భారత ఆల్‌రౌండర్ దీపక్ హుడా పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డే ముగిసిన తర్వాత బీసీసీఐ టీవీలో సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి హుడా మాట్లాడుతూ.. ‘వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేతో అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. ధోనీ లేక కోహ్లీ చేతుల మీదుగా టీమ్ఇండియా క్యాప్ అందుకోవాలన్నది నా చిన్ననాటి కల. దీంతో నా కల నెరవేరింది. కోహ్లీతో చేతుల మీదుగా క్యాప్ అందుకోవడం అద్భుత అనుభూతినిచ్చింది. మంచి రోజులకు సమయం పడుతుంది. అప్పటిదాకా మనం ఓర్పుగా ఎదురుచూస్తూ ఉండాల్సిందే. కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం గొప్ప అనుభూతి. వారి నుంచి నిరంతరం స్ఫూర్తి పొందుతూనే ఉంటా. నాదైన శైలిలో ఆడుతూ వెళ్లడమే నా పని. ఫలితం గురించి పెద్దగా ఆలోచించను’ అని 26 ఏండ్ల దీపక్ హుడా తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేతో దీపక్ వన్డేల్లో అరంగేట్రం చేయగా.. ఆ మ్యాచ్‌లో 26 పరుగులు చేశాడు. రెండో వన్డేలో 29 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.