ఇల్లెందు, జనవరి 05 : ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి ఓటరు జాబితాపై వార్డుల వారీగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మున్సిపాలిటీ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ అన్నారు. సోమవారం ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పురపాలక ఎలక్షన్ కోసం ఈ నెల 1వ తేదీన ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. వార్డుల వారీగా ఓటర్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9వ తేదీలోపు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. సవరణ అనంతరం మళ్లీ నూతన లిస్ట్ ప్రకటిస్తామని, కావున స్థానిక నాయకులందరూ గమనించాలని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అంకుషావలి, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Yellandu : ఇల్లెందు మున్సిపాలిటీ ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ