Large shivling | ప్రపంచంలోనే అత్యంత భారీ శివలింగం.. మధ్యలోనే నిలిచిపోయిన ప్రయాణం
Large shivling | ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యంత బరువైన శివలింగం (Shivaling) ప్రయాణం మధ్యలోనే నిలిచిపోయింది. తమిళనాడు (Tamil Nadu) లోని మహాబలిపురం (Mahabalipuram) లో తయారైన శివలింగం అదివారం ఉదయం బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చేరుకుంది.
Large shivling : ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యంత బరువైన శివలింగం (Shivaling) ప్రయాణం మధ్యలోనే నిలిచిపోయింది. తమిళనాడు (Tamil Nadu) లోని మహాబలిపురం (Mahabalipuram) లో తయారైన శివలింగం అదివారం ఉదయం బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చేరుకుంది. గోపాల్‌గంజ్‌లో గండక్ నది (నారాయణి నది) పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరడంతో ఆ భారీ శివలింగాన్ని తరలించడం అక్కడి అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది.
ఈ భారీ శివలింగం బరువు సుమారు 210 టన్నులు కాగా.. దీనిని తరలిస్తున్న 106 చక్రాల ప్రత్యేక ట్రైలర్ (లారీ) బరువు మరో 160 టన్నులు. ఈ రెండింటి మొత్తం బరువును ఆ వంతెన మోయలేదని నిపుణులు చెబుతున్నారు. వంతెనపై చాలాచోట్ల పగుళ్లు ఉన్నట్లు ప్రాథమిక తనిఖీల్లో గుర్తించడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, బీహార్ రాజ్యపుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ బృందాలను పిలిపించినట్లు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ సిన్హా తెలిపారు. బీహార్ మంత్రి అశోక్ చౌదరి కూడా గోపాల్‌గంజ్‌కు వచ్చి వంతెనను స్వయంగా పరిశీలించనున్నారు. వారి పరిశీలన అనంతరం శివలింగం తరలింపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా ఈ మహా శివలింగాన్ని తూర్పు చంపారన్ జిల్లా కేంద్రమైన మోతిహారిలోని విరాట్ రామాయణ్ ఆలయానికి తరలించాల్సి ఉంది. ఈ భారీ వాహనం మహాబలిపురం నుంచి 3,178 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 32 రోజుల్లో ఈ వాహనం గోపాల్‌గంజ్‌కు చేరుకుంది. శివలింగం తూర్పు చంపారన్ చేరుకోవడానికి మరో రెండు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, వాటి పరిస్థితి సంతృప్తికరంగా లేదని అధికారులు చెబుతున్నారు.
ఒక మార్గంలోని వంతెన సామర్థ్యం సరిపోదని, మరో మార్గంలో కూడా అనేక చిన్న వంతెనలు, కల్వర్టులు ఉండటంతో భారీ వాహనం ప్రయాణించడం కష్టమని భావిస్తున్నారు. దాంతో శివలింగాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు అధికారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

