Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Singireddy Niranjan Reddy | నార్లపూర్ రిజర్వాయర్ , పంపు హౌస్ సిద్ధంగా ఉన్నా నాయకుల నిర్లక్ష్యధోరణితో నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులకు వేలాది కోట్ల పంట నష్టం జరుగుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ : నార్లపూర్ రిజర్వాయర్ ( Narlapur Reservior ) , పంపు హౌస్ సిద్ధంగా ఉన్నా నాయకుల నిర్లక్ష్యధోరణితో నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులకు వేలాది కోట్ల పంట నష్టం జరుగుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Singireddy Niranjan Reddy ) ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగ మైన నార్లపూర్ రిజర్వాయర్‌ను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 24గంటల కరెంట్ ఇస్తే పంపులు ప్రారంభిస్తామని అధికారులు నివేదికలు ఇచ్చినా, జిల్లా మంత్రులు పెడచెవిన పెట్టి రైతులను ఆగం చేస్తున్నారని ధ్వజం ఎత్తారు.
మంత్రి కృష్ణా రావు బీర్ల కంపెనీకి నీళ్లు ఇవ్వాలని అంటారు. కానీ రైతుల గురించి పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.ఒకటి రెండు రోజులలో నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు పూనుకొని రైతులకు అండగా నిలుస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ హయాంలో నార్లపూర్ రిజర్వాయర్ పంపు హౌస్ సిద్ధం చేసి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 మోటార్లు సిద్ధం చేసి , ఒక పంపు ఆన్ చేసి రిజర్వాయర్ నుంచి నీళ్లు ట్రయల్ రన్ ద్వారా విడుదల చేశారని ఆరోపించారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల ద్వారా224 టీఎంసీలు, నల్లమల ద్వారా వచ్చే నీళ్లతో పాటు మొత్తం 244 టీఎంసీ నీళ్లు వచ్చి చేరాయని వెల్లడించారు. ఇందులో 50 టీఎంసీలు విద్యుత్తు ఉత్పత్తికి సరిపోగా, మిగతా 180 టీఎంసీల నీళ్లు వాడుకోకుండా ఆంధ్రాకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 5 పంపుల్లో ఒక్క పంపు మంచినీటికి నడిచినా, మిగతా రెండు పంపులు ఎందుకు నడుప్తలేరో చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డితో జిల్లాకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. మంత్రులకు బీర్ల కంపెనీకి నీళ్లు ఇచ్చే ద్యాస తప్పా రైతుల పట్ల సోయి లేదని నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఇప్పటికైనా కల్వకుర్తి 3 పంపులు 24గంటలు నిర్విరామంగా నడపాలని, నార్లపూర్ ఒక పంపు నడిపి రైతులను ఆదుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

