Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ (FMCG), ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public Sector Banks), ఐటీ షేర్ల (IT Shares) లో అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగింది. భారీ మార్కెట్ విలువ కలిగిన కంపెనీల షేర్లలో బలహీనత కనిపించడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ (FMCG), ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public Sector Banks), ఐటీ షేర్ల (IT Shares) లో అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగింది. భారీ మార్కెట్ విలువ కలిగిన కంపెనీల షేర్లలో బలహీనత కనిపించడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 547.65 పాయింట్లు నష్టపోయి 71,924.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 157.10 పాయింట్లు తగ్గి 22,363.35 వద్ద ముగిసింది. ప్రారంభంలో సానుకూలంగా కదిలిన నిఫ్టీ 22,600 స్థాయిని నిలబెట్టుకోలేకపోవడంతో అమ్మకాల ఒత్తిడికి లోనైందని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. నిఫ్టీకి తక్షణ మద్దతు 22,300-22,200 స్థాయిల మధ్య ఉందని నిపుణులు తెలిపారు.
ఈ స్థాయి కిందకు దాటితే 22 వేల వరకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు మార్కెట్లో కోలుకోవడం కొనసాగాలంటే నిఫ్టీ తిరిగి 22,500-22,600 స్థాయిని అధిగమించాల్సి ఉంటుందని అంచనా వేశారు. నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో నిలిచాయి. రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీలు ఎక్కువగా పడిపోయాయి.
అయితే మీడియా, కెమికల్స్ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నప్పటికీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కొంత మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.08 శాతం పెరుగగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 1.42 శాతం లాభపడింది. రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశలు మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లకు మద్దతిచ్చాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

