Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Bhagat Singh Photo On Voter List | ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఫొటో ఓటర్ల జాబితాలో కనిపించింది. ఇది రాజకీయ వివాదానికి దారితీసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్నికల అధికారి వివరణ ఇచ్చారు. ఈ పొరపాటును గుర్తించి సరిదిద్దినట్లు తెలిపారు.
చండీగఢ్: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఫొటో ఓటర్ల జాబితాలో కనిపించింది. ఇది రాజకీయ వివాదానికి దారితీసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్నికల అధికారి వివరణ ఇచ్చారు. ఈ పొరపాటును గుర్తించి సరిదిద్దినట్లు తెలిపారు. (Bhagat Singh Photo On Voter List) పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది. లూధియానా తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలోని ‘పార్ట్ 38’లో వరుస సంఖ్య 422 వద్ద ఉన్న ఓటరు వివరాల పక్కన ఆ ఓటరు ఫొటో బదులు భగత్ సింగ్ ఫొటో ఉన్నది. కాంగ్రెస్ నాయకుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ పొరపాటుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ‘ఇది ఒక్కటే చూడటం మిగిలి ఉంది’ అని సోషల్ మీడియా పోస్ట్‌లో విమర్శించారు.
కాగా, లూధియానా జిల్లా ఎన్నికల అధికారి దీనిపై స్పందించారు. ఆ తప్పుడు ఫొటో గతంలోని ఓటర్ల జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ఆగస్ట్ 13న ప్రచురించిన ముసాయిదా జాబితాలో అది అలాగే కొనసాగిందని చెప్పారు. అయితే ఓటరు జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో ఈ పొరపాటును గుర్తించి సరిదిద్దినట్లు వివరించారు. ఆ ఓటరుకు సంబంధించిన సరైన ఫొటోతో కూడిన తుది ఓటర్ల జాబితా సిద్ధమైందని, అక్టోబర్ 12న దీనిని ప్రచురిస్తామని ఎన్నికల అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

