Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Anurag Thakur: రాహుల్ గాంధీ ముందుగా ఏవేవో ఆరోపణలు చేస్తారని, ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్లి క్షమాపణలు చెబుతారని, ఇది ఆయనకు అలవాటుగా మారిందని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఆరోపణలు చేయడం, కోర్టులో సారీ చెప్పడం.. రాహుల్ గాంధీకి ట్రాక్ రికార్డుగా మారిందన్నారు.
న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన చేపడుతున్నారు. ఇవాళ తమ సమస్యను విన్నవించేందుకు ఏకంగా సుప్రీంకోర్టుకు ఆయన ర్యాలీ తీశారు. ఇతర కాంగ్రెస్ నేతలు, విపక్ష కూటమి సభ్యులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే రాహుల్ గాంధీ చర్యలను బీజేపీ తప్పుపట్టింది. రాహుల్ గాంధీ ముందుగా ఆరోపణలు చేస్తారని, ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్లి క్షమాపణలు చెబుతారని, ఇది ఆయనకు అలవాటుగా మారిందని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) అన్నారు. ఆరోపణలు చేయడం, కోర్టులో సారీ చెప్పడం.. రాహుల్ గాంధీకి ట్రాక్ రికార్డుగా మారిందన్నారు. ఆయన ముఖంపై దుమ్ము ఉన్నదని, కానీ ఆయన అద్దాన్ని తుడిచే ప్రయత్నం చేస్తున్నట్లు ఎంపీ ఠాగూర్ పేర్కొన్నారు.
#WATCH | Delhi: INDIA bloc MPs, including Lok Sabha LoP Rahul Gandhi, hold protest march
The alliance has called a march to the Supreme Court today. They have also announced that they would file a petition before the apex court in connection with CEC Gyanesh Kumar matter and their allegations with respect to the SIR process.
— ANI (@ANI) October 12, 2026
ప్రతిసారి ఎవరో ఒకర్ని నిందించడానికి రాహుల్ ఆరోపణలు చేస్తుంటారని, ఎవరో ఒకర్ని బలిపశువును చేయాలని చూస్తుంటాడని, కొన్ని సందర్భాల్లో ఎన్నికల కమీషన్‌ను, కొన్ని సందర్భాల్లో ఈవీఎంలను, కొన్ని సార్లు సీఈసీని, మరికొన్ని సార్లు ఏవేవో ఆరోపణలు చేస్తుంటారని ఎంపీ అనురాగ్ అన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, ఏకంగా ఆయన వీధుల్లోకి వెళ్లి దుర్భాషలాడుతున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఠాకూర్ పేర్కొన్నారు. వాస్తవాలు, నిజాలు, ఆధారాలను రాహుల్ చూపలేకపోతున్నట్లు చెప్పారు.
#WATCH | Delhi: On Rahul Gandhi, BJP MP Anurag Thakur says, “…He repeatedly levels allegations only to later apologise in court; that is his track record. The dust was on his own face, yet he kept wiping the mirror—right up until losing 99 elections. Every season, Rahul Gandhi looks for someone to blame or a scapegoat to target, sometimes the Election Commission, sometimes EVMs, sometimes the Chief Election Commissioner, and sometimes something else. And now, the situation has reached a point where Rahul Gandhi resorts to street-level language and levels baseless allegations…”
— ANI (@ANI) October 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

