Khiladi Trailer | పేకాటలో నలుగురు కింగ్స్.. ఈ ఆటలో ఒక్కడే కింగ్..
Raviteja Khiladi movie Trailer | మాస్ రాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ఖిలాడి. ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకే రోజు విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో ఖిలాడి సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇది చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఖిలాడి వస్తుంది. రవితేజ మరోసారి ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో కేక పెట్టించాడు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. డబ్బు చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది అని అర్థమవుతుంది.
ఒకవైపు యాక్షన్ బాగా చూపిస్తూనే.. మరోవైపు కామెడీ కూడా వదిలిపెట్టలేదు దర్శకుడు రమేశ్ వర్మ. 11 ఏండ్ల కింద ఈ కాంబినేషన్లో వచ్చిన వీర సినిమా డిజాస్టర్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రవితేజతో సినిమా చేశాడు రమేశ్ వర్మ. ఈసారి కచ్చితంగా హిట్ కొట్టి తీరుతాను అంటున్నాడు ఈయన. ఖిలాడిలో మరో అదనపు ఆకర్షణ హీరోయిన్ల అందాల ఆరబోత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ఒకరితో ఒకరు పోటీపడి మరీ గ్లామర్ షో చేశారు. ఇద్దరూ బికినీ ట్రీట్ ఇచ్చారు. మరోవైపు రవితేజ కూడా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాడు.
ట్రైలర్లో అనసూయ ఎక్కువగా కనిపించింది. ఖిలాడి సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తోంది ఈ జబర్దస్త్ యాంకర్. అంతేకాదు ఈ సినిమాలో ఈమెది ద్విపాత్రాభినయం అని తెలుస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, మరాఠీ నటుడు సచిన్ ఖేడ్ ఖర్ ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉంది. పేకాటలో నలుగురి కింగ్స్ ఉంటారు.. కానీ ఇక్కడ మాత్రం ఒక్కడే కింగ్.. ఎప్పుడూ ఒకే టీమ్‌కు ఆడటానికి నేను నేషనల్ ప్లేయర్ కాదు.. ఐపీఎల్ ప్లేయర్ ఎవరు ఎక్కువ వాడుకుంటే వాడి కోసం ఆడతా అంటూ అదిరిపోయే పంచ్ డైలాగులు చెప్పాడు రవితేజ. ఫిబ్రవరి 11న వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో ఖిలాడి సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాను కాస్త తక్కువకే బిజినెస్ చేశారు. రవితేజ ముందు 25 కోట్ల లక్ష్యం ఉంది. మొత్తానికి చూడాలిక ఖిలాడి సినిమాతో మాస్ రాజా ఏం చేస్తాడో..?
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
ఇదెక్కడి వింత.. ఫిబ్రవరి 11 న రవితేజ సినిమాతో రవితేజనే పోటీ..
కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న అనసూయ భరద్వాజ్..
Raviteja Remuneration |రవితేజ ఖాతాలో 75 కోట్లు.. ఎలాగో తెలుసా..?
Renu desai reentry | రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ !
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

