Anasuya Bharadwaj dual role | యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరతో పాటు సినిమాల్లో కూడా అనసూయకు మంచి గుర్తింపు ఉంది. క్రేజ్ ఉంది కదా అని ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ ఒప్పుకోదు అనసూయ. మనసుకు నచ్చిన పాత్రలు ఎంచుకుంటూ తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. చాలా మంది గ్లామర్ కోణంలోనే చూస్తారు. కానీ ఆమెలో ఎంతో అద్భుతమైన నటి ఉంది. క్షణం, రంగస్థలం, యాత్ర, పుష్ప లాంటి సినిమాలే అనసూయ నటనకు నిదర్శనం. అందుకే తెలుగులో ఏ యాంకర్ సక్సెస్ కాని రేంజ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనసూయ దూసుకుపోతుంది.
మొన్నటికి మొన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో మెప్పించింది అనసూయ. ఉన్నది కాసేపే అయినా కూడా ఆకట్టుకుంది అనసూయ. రెండో భాగంలో ఈమె పాత్రకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా కెరీర్లో మొదటి సారి ద్విపాత్రాభినయం చేస్తోంది అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం తెలుగులో రవితేజ ఖిలాడీ, చిరంజీవి గాడ్ ఫాదర్.. తమిళంలో ప్రభుదేవా ఫ్లాష్‌బ్యాక్.. మమ్ముట్టి భీష్మపర్వం సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో ఖిలాడి సినిమా ఫిబ్రవరి 11న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ పోషిస్తుందని.. కథను కీలక మలుపు తిప్పే పాత్రలు ఇవి అని తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Anasuya | ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. అనసూయ ఎమోషనల్..
Anasuya Bharadwaj | లంగా ఓణీలో అనసూయ అందాలు అదరహో..
Raviteja | రవితేజ ఖిలాడీ బిజినెస్‌కు రెక్కలు.. అన్ సీజన్లోనూ అదుర్స్..
Anasuya Bharadwaj | చీరకట్టులో అనసూయ మెరుపులు..