Raviteja | రవితేజ ఖిలాడీ బిజినెస్‌కు రెక్కలు.. అన్ సీజన్లోనూ అదుర్స్..

Raviteja Khiladi Movie | రవితేజ ప్రస్తుతం అర డజను సినిమాలతో బిజీగా ఉన్నాడు. పైగా ఒప్పుకున్న సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తున్నాడో తెలియదు కానీ అన్ని సినిమాలను లైన్లో పెట్టాడు మాస్ రాజా. ఇందులో అన్నింటికంటే ముందు విడుదలవుతున్న సినిమా ఖిలాడి. క్రాక్ తర్వాత రవితేజ మార్కెట్ ట్రాక్ ఎక్కింది. అందుకే రాబోయే సినిమాలకు సంబంధించిన బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. ప్రస్తుతం ఆయన రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం రవితేజ 10 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నాడు. ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఖిలాడి ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరుగుతుంది.
క్రాక్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్ల బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. కానీ ఇప్పుడు ఖిలాడీ సినిమాకు మాత్రం ఏకంగా రూ.22 కోట్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లకు పైగా ఈ సినిమా బిజినెస్ జరుగుతుంది. అన్ సీజన్ అయినా కూడా ప్రేక్షకులు వస్తారని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి ఓటీటీలో ఏకంగా రూ.40 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కుల కోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది. 40 కాకపోతే 45 అయిన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్లు. కానీ సినిమాను మాత్రం థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని మరోసారి అధికారికంగా ప్రకటిస్తూ యూఎస్ ప్రీమియర్ ఫిబ్రవరి 10 కన్ఫమ్ చేశారు నిర్మాతలు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి కరోనా సమయంలో రాబోయే ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..
భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ ప్రధానంగా చేసిన మూడు మార్పులివేనా..
Ramcharan in Acharya | ఆచార్యలో రామ్ చరణ్ నటించడానికి కారణమిదే
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

