Anasuya | ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. అనసూయ ఎమోషనల్..

Jabardasth Anchor Anasuya Bharadwaj | ఒకవైపు యాంకర్‌గా ఉంటూ.. మరోవైపు నటిగా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని విజయవంతంగా చేసి చూపిస్తుంది అనసూయ భరద్వాజ్. నిజానికి ఈమె రెండు పాత్రలు కాదు మూడు పాత్రల్లో సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. ఒక వైపు ఇండస్ట్రీలో ఉంటూనే.. మరోవైపు ఇంట్లో అమ్మ పాత్ర కూడా సమర్థవంతంగా పోషిస్తుంది ఈ సీనియర్ యాంకర్. మరోవైపు కెరీర్ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుంది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన జబర్దస్త్ కామెడీ షో ఎంత బిజీగా ఉన్నా కూడా వదిలిపెట్టడం లేదు అనసూయ భరద్వాజ్. మరో వైపు తనకు గుర్తింపు తీసుకొచ్చే పాత్రలు మాత్రమే చేస్తూ సినిమాల్లో దూసుకుపోతుంది.
ఇప్పటి వరకు ఈమె చేసిన క్యారెక్టర్స్ అన్నీ ప్రేక్షకులులకు బాగా గుర్తున్నాయి. అనసూయ కేవలం బుల్లితెరపై మాత్రమే గ్లామర్ షో చేస్తుంది. సినిమాల విషయానికి వచ్చేసరికి మాత్రం కేవలం నటనతోనే ముందుకు వస్తుంది. యాత్ర, క్షణం, రంగస్థలం, కథనం లాంటి సినిమాలు అనసూయలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఇక మొన్న విడుదలైన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో మంగళం శ్రీను భార్య దాక్షాయని పాత్రలో విలనిజం పండించింది అనసూయ. ఇందులో సునీల్ భార్యగా నటించింది ఈమె. ఈ క్యారెక్టర్ సినిమాలో చిన్నగానే ఉన్నా కూడా గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది. అయితే రెండో భాగం మాత్రం అనసూయ పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటున్న పుష్ప సినిమాపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించింది అనసూయ.
పుష్ప సినిమా తన కెరీర్లో గేమ్ ఛేంజర్ అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే తెలిసిన అనసూయ.. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకు పరిచయమైంది అంటే దానికి కారణం పుష్ప. అందుకే ఈ సినిమా ఎప్పటికీ తన జీవితంలో స్పెషల్ అంటుంది అనసూయ. ప్రస్తుతం తెలుగులో రవితేజ ఖిలాడీ, చిరంజీవి గాడ్ ఫాదర్ సహా మరో మూడు నాలుగు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చింది. మరోవైపు మలయాళంలో మమ్ముట్టి సినిమాలో హీరోయిన్గా కేరళ ప్రేక్షకులకు పరిచయం అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఏంటి.. జబర్దస్త్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందా.. ఫీమేల్ ఆర్టిస్టులకు కష్టాలు..?
Anasuya: గుండు కొట్టించుకుంటానంటున్న అనసూయ.. ఎందుకో తెలుసా?
Anasuya Bharadwaj | అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న అనసూయ.. ఫొటోలు వైరల్
Anasuya Bharadwaj | ఎల్లో డ్రెస్‌లో ఏంజెల్లా మెరుస్తున్న అనసూయ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

