Raviteja Remuneration |రవితేజ ఖాతాలో 75 కోట్లు.. ఎలాగో తెలుసా..?

Raviteja Remuneration | ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు మాస్ రాజా రవితేజ. ఒకప్పుడు రవితేజ ఎలా వరుస సినిమాలు అయితే చేసేవాడో ఇప్పుడు మళ్లీ అలా చేస్తున్నాడు. ఒకేసారి అన్ని సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా వాటి షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. క్రాక్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచాడు ఈ హీరో. అయినా కూడా నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కనీసం 12 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నాడు రవితేజ. అందులో కొన్ని సినిమాలకు ఎక్కువ కూడా తీసుకుంటున్నాడు.
ఉదాహరణకు రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం ఆయన కేవలం 30 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడు. అందులోనే సినిమా పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడని తెలుస్తుంది. కొత్త దర్శకుడు శరత్ మండవ కూడా దీనికి తగ్గట్టుగానే షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ రవితేజ తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంటే రోజుకు అక్షరాల 50 లక్షలు అన్నమాట. మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరావు బయోపిక్ కోసం రవితేజ రూ.18 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇది మాత్రమే కాదు త్రినాథరావు నక్కిన ధమాక, రమేష్ వర్మ ఖిలాడి, సుధీర్ వర్మ రావణాసుర సినిమాలకు కూడా భారీ పారితోషికమే అందుకుంటున్నాడు ఈయన. మరోవైపు చిరంజీవి బాబి సినిమాలో రవితేజ ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడు. దీనికోసం దాదాపు 8 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా 6 సినిమాలు చేస్తూ అన్ని సినిమాలకు కలిపి దాదాపు 75 కోట్ల రెమ్యునరేషన్ రవితేజ అందుకోబోతున్నాడు. ఎంతమంది హీరోలు ఉన్నా మాస్ రాజా క్రేజ్ తగ్గలేదు అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఖిలాడి ఫిబ్రవరి 11న విడుదల అవుతుంటే.. నెల రోజుల గ్యాప్‌లోనే మార్చి 25న రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. సమ్మర్ తర్వాత ధమాకా.. దసరాకు రావణాసుర సినిమాలు విడుదల కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Renu desai reentry | రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ !
Daksha nagarkar | మూడో సినిమాకే విలన్‌గా మారిన జాంబిరెడ్డి భామ
Raviteja | రవితేజ ఖిలాడీ బిజినెస్‌కు రెక్కలు.. అన్ సీజన్లోనూ అదుర్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

