daksha nagarkar in Raviteja movie | హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది దక్ష నగార్కర్. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. అయినప్పటికీ ఈ ముంబై భామకు.. పెద్ద సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు ఆమెకు బంపర్ ఆఫర్ తగిలింది. మాస్ మహారాజా రవితేజ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమా రూపొందుతున్నది. సంక్రాంతి సందర్బంగా ఈ నెల 14 సినిమాను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా క్యాస్టింగ్‌ను ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. అయితే రవితేజ గత చిత్రం క్రాక్ మాదిరిగానే ఈ చిత్రంలో కూడా ఒక పవర్ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం జాంబిరెడ్డి భామ దక్ష నగార్కర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం రావణాసుర చిత్ర యూనిట్ దక్షను సంప్రదించిందట. సుధీర్ వర్మ చెప్పిన కథ, అందులో తన పాత్ర నచ్చడంతో ఈ ముంబై భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా దక్ష స్టార్ స్టేటస్‌ను అందుకుంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Daksha Nagarkar | కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న దక్ష నాగర్కర్..
Daksha Nagarkar | దక్ష నగార్కర్ హాట్ ఫోటో గ్యాలరీ
Daksha nagarkar | పబ్జీ గాళ్ అందానికి ఫిదా అవ్వాల్సిందే..స్టిల్స్ వైరల్