హుషారు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంది అందాల భామ దక్షా నగార్కర్. జాంబిరెడ్డి చిత్రంలో పబ్జీ గాళ్‌గా అలరించింది. తన అందం, అభినయంతో ఆకట్టుకునే ఈ భామ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొంది.
బ్లాక్ లింగరీ టాప్ విత్ డెనిమ్ జాకెట్, షార్ట్స్ డ్రెస్‌లో హాట్ హాట్ లుక్స్ తో కండ్లు పక్కకు తిప్పుకోకుండా చేస్తోంది.
ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..’ఆమె ఒక స్టార్ లాగా కనిపిస్తుంది.
ఆమె శరీరం రాక్ గిటార్ ఆకారంలో ఉంటుంది’ అని టియావో క్రూజ్ సాంగ్ లైన్స్ ను క్యాప్షన్ గా ఇచ్చింది దక్షా.
దక్షా వన్నె తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోన్న ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
దక్షా నగార్కర్ జాబితాలో పలు సినిమాలు లైన్లో ఉన్నట్టు తెలుస్తోండగా..వాటికి సంబంధించిన అప్డేట్స్ రావాల్సి ఉంది.