Manchu Lakshmi | టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి కరోనా సోకింది. తనకు కరోనా సోకినట్టు సోషల్ మీడియా ద్వారా లక్ష్మి ప్రకటించింది. రెండేళ్ల పాటు నాతో అది దాగుడు మూతలు ఆడింది. చివరకు నాకు కూడా సోకింది. దానితో పోరాడేందుకు నేను ఎంతో ప్రయత్నించా. కానీ.. దానికి వేరే ప్లాన్స్ ఉంటాయి కదా. అందుకే నన్నూ విడిచిపెట్టలేదు. కరోనాకు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్‌తో దాన్ని ఎలాగైనా నానుంచి పంపించేస్తా. అందరూ ఇంట్లో సేఫ్‌గా ఉండండి. మాస్క్ ఖచ్చితంగా ధరించండి… అంటూ ట్వీట్ చేసిన లక్ష్మి.. మీకు నచ్చిన ఫేవరేట్ షోలు, మూవీస్ ఏంటో నాకు చెప్పండి. నేను అవి చూస్తూ టైమ్ పాస్ చేస్తా. కొన్ని పాడ్‌కాస్ట్‌లు కూడా సజెస్ట్ చేయండి.. అంటూ మరో ట్వీట్లో పేర్కొంది లక్ష్మి.
అలాగే.. అందరూ వాక్సిన్ వేసుకోవాలని.. ఇప్పటికే రెండు డోసులు వేసుకుంటే.. బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలని లక్ష్మి చెప్పుకొచ్చింది.
Don't forget to GET VACCINATED and if you are double vaccinated, find the best the booster for you.
— Lakshmi Manchu (@LakshmiManchu) January 6, 2022
Ok now suggest your top three fav shows and movies for me to watch. Send in some podcasts too!!
ఇక.. నెటిజన్లు తమకు తోచిన సినిమా పేర్లను తనకు కామెంట్లు చేశారు. ఈ సినిమాలు చూడండి అంటూ ఎవరికి నచ్చిన పేర్లు వాళ్లు చెబుతూ.. మంచు లక్ష్మి ట్వీట్లను వైరల్ చేస్తున్నారు.