డిండి, ఆగస్టు : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని జిల్లా పార్టీ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు. నల్లగొండ జిల్లా డిండి మండలంలోని ఎర్రగుం టపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కడారి పెద్దయ్యపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి దాడి చేసారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి చేయాలి తప్ప దాడికి పాల్పడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మా మంచి తనాన్ని అలుసుగా తీసుకోవద్దన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.