న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ చాట్‌జీపీటీ టెక్ ప్రపంచాన్ని ఊపేస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చాట్‌బాట్‌తో కొలువులు కోల్పోతామనే ఆందోళన ప్రపంచాన్ని వణికిస్తోంది.
ఇక మౌస్ ట్రాప్ నుంచి ఓ ఎలుక చాకచక్యంగా ఆహారాన్ని దొంగిలిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆహారాన్ని అందిపుచ్చుకునేందుకు ఆ ఎలుక ఓ కర్రను (టూల్) ఉపయోగించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆహారం చోరీ కోసం చిన్న జంతువు ర్యాట్జీపీటీని ఉపయోగించిందని ట్విట్టర్ యూజర్లు కామెంట్ చేశారు.
To hell with Artificial Intelligence learning how to take over.
If the rats are using tools now, we are really phucked.
Introducing RatGPT … pic.twitter.com/l8btDg0s5v
— Wall Street Silver (@WallStreetSilv) April 20, 2023
ర్యాట్జీపీటీని ప్రవేశపెడుతున్నామని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 12 లక్షల మంది పైగా వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ప్రపంచంలో ప్రతి ప్రాణి తనదైన శైలిలో ఎదుగుతుందని పలువురు కామెంట్ చేయగా మరికొందరు ఈ వీడియోను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read More