Loksabha Elections 2024 : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జయంత్ చౌధరి సారధ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు షాహిద్ సిద్ధిఖి రాజీనామా చేశారు. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిన సమయంలో మౌనంగా ఉండటం పాపమని రాజీనామా చేస్తూ షాహిద్ సిద్ధిఖి స్పష్టం చేశారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవితో పాటు ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, తన రాజీనామా లేఖను ఆదివారం ఆర్ఎల్డీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌధరికి పంపానని ఆయన పేర్కొన్నారు.
జయంత్ నాయకత్వం పట్ల తనకు విశ్వాసం ఉన్నప్పటివకీ ఆర్ఎల్డీ నుంచి బరువెక్కిన హృదయంతో బయటకు రావాల్సి వచ్చిందని అన్నారు. భారత సమగ్రత, ఏకత, అభివృద్ధి, సోదరభావం అందరినీ కలుపుకుపోతుందని, దీన్ని కాపాడుకోవడం ప్రతిఒక్క పౌరుడి భాద్యతని ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఎన్నికలు ప్రకటించిన అనంతరం ఎన్నికైన సీఎంలు, విపక్ష నేతలపై దాడులు ప్రజాస్వామ్యం, మనం నిర్మించుకున్న ఉన్నత వ్యవస్ధలపై దాడేనని మరో పోస్ట్‌లో సిద్ధిఖి పేర్కొన్నారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా ఆర్ఎల్డీ భాగ్‌పట్, బిజ్నోర్ లోక్‌సభ స్ధానంలో పోటీ చేయనుండగా మరో రాజ్యసభ స్ధానం కేటాయించేందుకు బీజేపీతో ఒప్పందం కుదిరింది.
Read More :
Leopard | ఢిల్లీలో చిరుత కలకలం.. ఐదుగురిపై దాడి