Rashmika Mandanna | సినీ ఇండస్ట్రీలో వెడ్డింగ్ రూమర్స్ సర్వసాధారణమని తెలిసిందే. అయితే ప్రతీ యేటా ఎవరో ఒక సెలబ్రిటీ కపుల్ వెడ్డింగ్ పుకార్లతో నెట్టింట హా్ట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. అలాంటి వారిలో టాప్‌లో ఉంటారు టాలీవుడ్ లవ్‌బర్డ్స్‌గా పేరుగాంచిన హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda),నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna).
ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని పెళ్లి పీటలెక్కబోతున్నారని, 2026 ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరుగుతుందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి రష్మికకు ఇదే ప్రశ్న ఎదురైంది. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి చెప్తానంది రష్మిక. ఎప్పటిలాగే పుకార్లను ఖండించడం కానీ ఒప్పుకోవడ్ కానీ చేయలేదు రష్మిక.
గత నాలుగేళ్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. నిజమేంటంటే సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే పెళ్లి గురించి స్పందిస్తానని రష్మిక మందన్నా చెప్పింది. రష్మిక మందన్నా కామెంట్స్ చూస్తే రాబోయే రోజుల్లో వెడ్డింగ్ న్యూస్ చెప్పడం ఖాయమైపోయినట్టేనని హింట్ ఇచ్చిందంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబోగా నిలిచారు విజయ్ దేవరకొండ-రష్మిక. ఈ మూవీ టైం నుంచి ఇద్దరి రిలేషన్షిప్ మొదలైందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
విజయ్-రష్మిక చాలాసార్లు తమ రిలేషన్షిప్ గురించి హింట్స్ ఇస్తూనే వస్తున్నా.. ఎప్పుడూ కూడా అధికారికంగా అభిమానులకు కానీ, ప్రజలకు కానీ వెల్లడించలేదు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మంచి హిట్టందుకున్న రష్మిక ప్రస్తుతం కాక్టైల్ 2, మైసా చిత్రాల్లో నటిస్తోంది.
Anti Biotics | యాంటీ బయోటిక్స్ వాడితే.. పేగుల ఆరోగ్యాన్ని ఇలా రక్షించుకోండి..!
Mirai | టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’… ఈ నెలలోనే స్టార్ మా లో సందడి
Bhadradri Kothagudem : ‘గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు’