అగ్ర కథానాయిక రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్‌ని సంపాదించుకుంది. అభిమానులు ఆమెను నేషనల్ క్రష్ అంటూ అప్యాయంగా పిలుస్తుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో రష్మిక బిజీగా ఉంది. అందులో ‘మైసా’ ఒకటి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. గోండుల నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న వారియర్ ప్రిన్స్ పాత్రలో కనిపించనున్నది.
తనవారి కోసం ఎంతటి పోరాటానికైనా వెరవని ధీరవనితగా ఆమె పాత్ర సాగనుంది. కొన్ని మాసాల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. తాజా సమాచారం ప్రకారం దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేస్తారని తెలిసింది. ఇందులో రష్మిక మందన్న మునుపెన్నడూ చూడని విధంగా పవర్ఫుల్ యాక్షన్ రోల్లో కనిపిస్తుందని, ఆమె అభిమానులకు ఓ సర్ప్రైజ్లా ఉంటుందని చెబుతున్నారు. రష్మిక మందన్న నటించిన హిందీ చిత్రం ‘థామా’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.