దీపావళికి ఓ సర్ప్రైజ్
అగ్ర కథానాయిక రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్‌ని సంపాదించుకుంది. అభిమానులు ఆమెను నేషనల్ క్రష్ అంటూ అప్యాయంగా పిలుస్తుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో రష్మిక బిజీగా ఉంది. అందులో ‘మైసా’ ఒకటి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్‌ని సంపాదించుకుంది. అభిమానులు ఆమెను నేషనల్ క్రష్ అంటూ అప్యాయంగా పిలుస్తుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో రష్మిక బిజీగా ఉంది. అందులో ‘మైసా’ ఒకటి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. గోండుల నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న వారియర్ ప్రిన్స్ పాత్రలో కనిపించనున్నది.
తనవారి కోసం ఎంతటి పోరాటానికైనా వెరవని ధీరవనితగా ఆమె పాత్ర సాగనుంది. కొన్ని మాసాల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. తాజా సమాచారం ప్రకారం దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేస్తారని తెలిసింది. ఇందులో రష్మిక మందన్న మునుపెన్నడూ చూడని విధంగా పవర్ఫుల్ యాక్షన్ రోల్లో కనిపిస్తుందని, ఆమె అభిమానులకు ఓ సర్ప్రైజ్లా ఉంటుందని చెబుతున్నారు. రష్మిక మందన్న నటించిన హిందీ చిత్రం ‘థామా’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

