నిప్పు లేనిదే పొగరాదంటారు. ఏదో కదలిక జరక్కపోతే ఏ వార్త అయినా ఇంతగా వ్యాప్తి చెందదు. పవన్‌కల్యాణ్ తాజా సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తూవుంది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా. దీనికి నిర్మాత దిల్‌రాజు.. అనేది ఈ వార్త సారాంశం. రీసెంట్గా ‘ఓజీ’ సంబరాల్లో పాల్గొన్న దిల్ రాజు.. నెక్ట్స్ పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తానని, ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. రిక్వెస్ట్ చేసైనా డేట్స్ తీసుకుంటానని సభాముఖంగానే చెప్పారు.
ఇప్పుడు వినిపిస్తున్న వార్తకు, అప్పుడు దిల్‌రాజు మాట్లాడిన మాటలు మరింత బలాన్నిచ్చాయి. ఇక తన కెరీర్లో ఎక్కువ సినిమాలు దిల్ రాజు సంస్థలోనే చేసిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తున్నది.
ఏ స్టార్‌కి తగ్గట్టుగా ఆ స్టార్‌కి కథను సెట్ చేసి సూపర్హిట్లు కొట్టడం అనిల్‌కు పెన్నుతో పెట్టిన విద్య. అందుకే పవన్‌తో తాను చేయబోతున్న సినిమాకు అనిల్‌ని దర్శకుడిగా దిల్ రాజు సెట్ చేశారట. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ప్రస్తుతం చిరంజీవితో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి . సంక్రాంతికి సినిమా విడుదల కానున్నది. పవన్ కూడా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ని దాదాపుగా పూర్తి చేసేశారు.