iBOMMA Ravi | ఐబొమ్మ రవికి బెయిల్.. షరతులు విధించిన హైకోర్టు..!
iBOMMA Ravi : సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి ఊరట లభించింది. నిరుడు నవంబర్ 16 నుంచి అతడు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
iBOMMA Ravi : సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి ఊరట లభించింది. నిరుడు నవంబర్ 16 నుంచి అతడు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణ హైకోర్టు మంగళవారం రవికి షరుతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లొద్దని, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరవ్వాలని అతడికి హైకోర్టు స్పష్టం చేసింది.
సినిమాల పైరసీతో నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఇమంది రవిని గత ఏడాది నవంబర్ 16న సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు పాల్పడినందున అతడిపై మొత్తంగా ఐదు కేసులు నమోదు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు, బెట్టింగ్ యాప్ ప్రమోషనల్ వ్యవహారంలో మరో కేసు పెట్టారు. అయితే.. రవి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా నాంపల్లి కోర్టు కొట్టివేసింది. అయినా సరే పలుమార్లు బెయిల్‌కోసం ప్రయత్నించిన రవికి బిగ్ రిలీఫ్ ఇస్తూ.. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
షరతులు ఇవే..
ఐబొమ్మ రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. విదేశాలకు పారిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు వెళ్ల పాస్ పోర్టును కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు ఇంటర్నెట్ ఉపయోగించవద్దని.. ఒకవేళ నెట్ వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని రవికి తెలియజేసింది.
పలువురు సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా రవిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ ఐదు కేసుల విషయంలో పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్టు చేసి విచారించారు. పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు? అతని వెనుక ఇంకా ఎవరెవరున్నారు? అతను ఒక్కడే ఈ పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ను నడిపాడా? లేదా గ్రూపుగా పనిచేశారా? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణలో రవి తన స్నేహితుల సర్టిఫికెట్లు దొంగిలించాడనే విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?


